1 - 20 of 600 MCQs found


శిశువు యొక్క అతి ముఖ్యమైన శోధనలకు వీరు మార్గదర్శకత్వం వహిస్తారని వైగాట్ స్కీ సాంఘిక -సాంస్కృతిక సిద్ధాంతం సూచిస్తుంది?

(A)   తల్లిదండ్రులు మాత్రమే.
(B)   ఇతర పిల్లలు 
(C)   ట్యూటర్ల పాత్ర వహించే వయోజనులు.
(D)   ట్యూటర్ల పాత్ర వహించే వయోజనులు కాని పిల్లలు కాని కారు.


భిన్నాల సంకలన పాఠం బోధించిన పిదప ఉపాధ్యాయుడు విద్యార్థులను మొదటి అభ్యాస సెషన్ లో పాల్గొనజేశాడు. విద్యార్థులు భిన్నాల సంకలనంలో ప్రావీణ్యతను సాధించుటకు మొదటి అభ్యాస సెషన్ లో ఉపాధ్యాయుడి పాత్ర?

(A)   నైపుణ్యాల అభ్యసన ప్రాధాన్యతను పునర్చలనం చేయడం.
(B)   విద్యార్థుల అవగాహనానను పరీక్షించి ఫీడ్ బ్యాక్ ను అందించుట.
(C)   కఠినమైన సమస్యలు ప్రయత్నించే సాహసాన్ని చేయమని విద్యార్థులను సవాలు చేయుట.
(D)   విద్యార్థుల సహకారం  సహకారం మరియు సహ విద్యార్థుల సమాలోచనకు సదుపాయం కల్పించుట.


"బాగా మాట్లాడే నైపుణ్యం కలిగి, చేతి రాత బాగా లేని శిశువు" ఇది క్రింది వానిలో ఒక భావనను వివరించుటకు సరియైనది?

(A)   వ్యక్త్యంతర తరగతి భేదాలు 
(B)   వ్యక్త్యంతర - వైయక్తిక భేదాలు 
(C)   వ్యక్త్యంతర - వ్యక్తిగత భేదాలు 
(D)   వ్యక్త్యంతర్గత వైయక్తిక భేదాలు అభ్యాసకులలో సాంఘికాభివృద్ధిని పెంపొందించుటకు ఉపాధ్యాయుడికి తెలిసి ఉండవలసినది....?

(A)   అభ్యాసకుల వ్యక్తిగత అభిరుచులు.
(B)   అభ్యాసకుల శారీరకాభివృద్ది.  
(C)   అభ్యాసకులకు చెందిన అన్ని అంశాలు.
(D)   అభ్యాసకుల నిష్పాదన.


పరిశోధనధార అభ్యసనలో అభ్యాసకుని భాగస్వామ్యం ఇలా ఉంటుంది?

(A)   క్రియాత్మకంగా 
(B)   నిష్క్రియాత్మకంగా 
(C)   నిష్క్రియాత్మకంగా లేదా క్రియాత్మకంగా 
(D)   పరాధీనంగా 


శాబ్దికేతర ప్రజ్ఞా పరీక్షను వీరికి ఉపయోగించవచ్చును?

(A)   వయసుతో సంబంధం లేకుండా అందరికి 
(B)   నిరక్షరాస్యులకు మాత్రమే.
(C)   పిల్లలకు మాత్రమే.
(D)   అక్షరాస్యులకు మాత్రమే.


స్మృతికి సంబంధించి, ఈ క్రింది వానిలో సరియైనది?

(A)   గుర్తింపు పునఃస్మరణకు సరిగ్గా రెండింతలు ఉంటుంది.
(B)   గుర్తింపు కంటె పునఃస్మరణ మిన్న.
(C)   పునఃస్మరణ కంటె గుర్తింపు మిన్న 
(D)   పునఃస్మరణ, గుర్తింపు సమానం.ఉచిత, నిర్బంధ బాలల హక్కు విద్యా చట్టం - 2009 వర్తింపు....?

(A)   కేరళ రాష్ట్రంను మినహాయించి భారతదేశం మొత్తానికి.
(B)   భారతదేశం మొత్తానికి.
(C)   కేంద్రపాలిత ప్రాంతాలను మినహాయించి భారతదేశం మొత్తానికి.
(D)   జమ్మూ-కాశ్మీరును మినహాయించి భారతదేశం మొత్తానికి.సాంప్రదాయక నిబంధనానికి ఉదాహరణ..........?

(A)   విద్యుత్ ఘాతము నుండి కుక్కలు అసహాయతను నేర్చుకొనుట.
(B)   ఆహారం కోసం ఎలుక మీట నొక్కుట.
(C)   కుక్క గంట మోతకు లాలాజలాన్ని స్రవించటం నేర్చుకొనుట.
(D)   పావురము ఆహారం విడుదల కోసం 'కీ' ని ముక్కుతో కొట్టుట.
ఎనిమిదవ తరగతి చదువుచున్న ఒక విద్యార్థి బహుమతి పొందుటకు మాత్రమే చదివేందుకు అలవాటు పడినాడు. ఇది దీనికి ఉదాహరణ?

(A)   కార్యసాధక నిబంధనా సిద్ధాంతం 
(B)   S-R నిబంధనా సిద్ధాంతం 
(C)   R-S నిబంధనా సిద్ధాంతం 
(D)   S-R మరియు R-S నిబంధనా సిద్ధాంతాలు.


పిల్లవాని వలెనా లేదా వయోజనుల వలె ఉండవలెనా అనే సందిగ్ధ స్థితిలో ఉండే శిశు వికాస దశ....?

(A)   వయోజన దశ 
(B)   ఉత్తర బాల్య దశ
(C)   కౌమార దశ
(D)   పూర్వ బాల్య దశ


జాతీయ పాఠ్య ప్రణాళికా చట్టం - 2005 ప్రకారం బోధన ఉద్దేశ్యం?

(A)   శిశువు తన సామర్ధ్యాల కంటె ఎక్కువగా సాధించునట్లు చేయడం.
(B)   జ్ఞాన నిర్మాణం 
(C)   విద్యార్థుల పరీక్షలకు తయారు చేయడం.
(D)   విద్యార్థులకు సరియైన జ్ఞానంను అందించడం.


స్వయం వేగముతో అభ్యసించుట దీనిలో సాధ్యమౌతుంది?

(A)   కృత్యాధార అభ్యసనం 
(B)   కార్యక్రమాయుత బోధన
(C)   మొత్తం తరగతి బోధన
(D)   చిన్న సమూహాలలో బోధన
ఆంగ్లేతర భాషను మాట్లాడే కుటుంబాల నుండి వచ్చే పిల్లలకు బోధించునప్పుడు ఇలా భావించడం సరైనది.

(A)   బహు భాషా పిల్లలు విద్యాపరంగా వెనుకబడి ఉంటారు.
(B)   కొత్త దానిని అలవాటు చేసుకొనుటకు గాను పిల్లలు పూర్వభాషను/సంస్కృతిని వదిలి వేస్తారు.
(C)   ఒక భాషలోని నైపుణ్యత రెండో భాషను నేర్చుకొనుటలో ఉపయోగపడుతుంది, కాబట్టి పిల్లలలో ద్విభాషను ప్రోత్సహించడం వల్ల భాషా నైపుణ్యాలు మెరుగవుతాయి.
(D)    బడిలో పిల్లల భాషకు సంస్కృతికి పునర్చలనం అందించక పోయిన నష్టం లేదు, ఎందుకనగా అవి ఇంటి వద్ద పోషించబడతాయి.


బోధన చేపట్టుటకు ముందు దీనిని చేయవలసిన అవసరం ఉంది?

(A)   అభ్యసన కొరకు అంచనా వేయుట 
(B)   నిరంతర సమగ్ర మూల్యాంకనం 
(C)   అభ్యసనను అంచనా వేయుట 
(D)   అభిరుచిని అంచనా వేయుట 


వయోజనుల ఆలోచనల కంటే పిల్లల
ఆలోచనలు తక్కువ అమూర్తంగా
ఉంటాయనడంలో మన ఉద్దేశ్యము

(A)   వయోజనుల ప్రాపంచిక అవగాహన ప్రత్యేక ఉదాహరణలు, స్పష్టమైన, ఇంద్రియ జ్ఞానం ఆధారంగా ఉంటుంది.
(B)   పిల్లలు ఎక్కువ ఉదాహరణలు, సాధారణీకరణాలను ఉపయోగిస్తారు.
(C)   పిల్లలు ఎక్కువ సూత్రాలను ఉపయోగిస్తారు కానీ, వారికి తక్కువ సాధారణీకరణాలు అవసరమవుతాయి.
(D)   పిల్లలు తక్కువ సాధారణీకరణాలను, వర్గీకరణాలను, సూత్రాలను ఉపయోగిస్తారు.