1 - 20 of 450 MCQs found

ఒక శిశువు బొమ్మను మొదట తన పిడికిలిని ఉపయోగించి పట్టుకుంటాడు. పెరుగుతున్న కొద్దీ దానిని వేళ్ళతో పట్టుకుంటాడు. దీనిని వివరించే సూత్రం?

(A)   వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు.
(B)   వికాసం పరస్పర సంబంధంగా ఉంటుంది.
(C)   వికాసం శిరఃపాదాభిముఖంగా కొనసాగుతుంది.
(D)   వికాసం సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశగా కొనసాగుతుంది.


ఈ క్రింది వాటిలో కౌమారదశలో ఉద్వేగవికాసానికి సంబంధించని లక్షణము?

(A)   సాధారణ ఉత్తేజం 
(B)   ఉద్వేగ అస్థిరం 
(C)   భయం మరియు వ్యాకులత 
(D)   సందిగ్ధత మరియు అనిశ్చితి 




కింది వాటిలో అభ్యసనకు సంబంధించి, NCF-2005 సూచించింది:

(A)   అభ్యసన తరగతి గదిలో మాత్రమే జరగాలి. 
(B)   ఉపాధ్యాయుని నుండి జ్ఞానాన్ని సముపార్జించుటకు గాను విద్యార్థులు నిష్క్రియాత్మకంగా ఉండాలి.
(C)   అభ్యసన ఉపాధ్యాయ నిర్దేశితంగా ఉండాలి. 
(D)   అభ్యససం విస్తృత సాంఘిక పరిస్థితుల్లో జరగాలి.


ఉపాధ్యాయుడు విజాతీయ తరగతి గదిని ఈ విధంగా చూడాలి?

(A)   అభ్యసన వనరుగా  
(B)   విద్యార్థుల సర్దుబాటుకు ఆటంకంగా 
(C)   తరగతి బోధనాభ్యసనమునకు విద్యార్థులను వేరు చేయుటకు గాను 
(D)   ఉపాధ్యాయునికి భారంగా


వ్యక్తి వికాసం ప్రభావం చూపించే శారీరక కారకం?

(A)   ఉష్ణోగ్రత  
(B)   ఆహారము  
(C)   హార్మోన్లు  
(D)   కాంతి 




పాఠం సరైన క్రమంలో వ్యవస్థీకరించక పోవడం వల్ల 5వ తరగతి విద్యార్థులు అర్థం చేసుకోలేక పోయారు. విద్యార్థుల అవగాహనను ప్రభావితం చేసిన అభ్యసన కారకం?

(A)   వ్యక్తిగత 
(B)   పరిసరాత్మక 
(C)   వ్యక్తిగత మరియు పరిసరాత్మక
(D)   వ్యక్తిగత కాదు మరియు పరిసరాత్మక కాదు



కింది వాటిలో సరైన వాక్యాన్ని పర్తించండి?

(A)   బోధన పరస్పర చర్యాత్మక ప్రక్రియ, అభ్యసన నిష్క్రియాత్మక ప్రక్రియ.
(B)   బోధన నిష్క్రియాత్మక ప్రక్రియ, అభ్యసన పరస్పర చర్యాత్మక ప్రక్రియ. 
(C)   బోధన మరియు అభ్యసన రెండు కూడా పరస్పర చర్యాత్మక ప్రక్రియలే. 
(D)   బోధన మరియు అభ్యసన రెండు కూడా నిష్క్రియాత్మక ప్రక్రియలే.


ఉన్నత పాఠశాలలన్నింటికీ అత్యాధునికమైన విద్యాసాంకేతికతను అందించినట్లయితే ....?

(A)   ఉపాధ్యాయుల స్థానాన్ని పూర్తిగా భర్తీ చేస్తుంది. 
(B)   ఒకే ఉపాధ్యాయుడు తరగతులన్నింటినీ నిర్వహించగలడు. 
(C)   'ఒక తరగతికి ఒకే ఉపాధ్యాయున్ని' కల్పిస్తే సరిపోతుంది. 
(D)   ఉపాధ్యాయుల స్థానాన్ని భర్తీ చేయలేము.


నీ తరగతిలోని ఒక పిల్లవాడు ఎప్పుడూ తికమక పడుతూ నిర్ణయం తీసుకోలేని స్థితిలో ఉన్నాడు. ఒక ఉపాధ్యాయునిగా నీవు ...?

(A)   అతని కొరకు నిర్ణయం తీసుకుంటావు. 
(B)   పెద్దలను సంప్రదించమని అతనికి తెలుపుతావు.
(C)   సరైన నిర్ణయాలు తీసుకొనేందుకు అతనికి మార్గదర్శకత్వము ఇస్తావు. 
(D)   ఉపాధ్యాయుల సూచనలను పాటించవని చెబుతావు.


 'సాంఘిక నిర్మాణాత్మక బోధనాభ్యసన సిద్దాంతం' ప్రకారం తరగతి గదిలో ఉపాధ్యాయుని పాత్ర ...?

(A)   ప్రదర్శకుడు 
(B)   బోధకుడు 
(C)   సౌకర్యకర్త 
(D)   ప్రేక్షకుడు


అభ్యసన వక్రరేఖలో పీఠభూమి దశ దీనిని సూచిస్తుంది?

(A)   అభ్యసనం పూర్తి అగుట 
(B)   అభ్యసనం ప్రారంభమగుట
(C)   అభ్యససంలో వేగం పెరుగుట 
(D)   అభ్యసనంలో తాత్కాలిక నిలకడ


హావిఘర్స్ట్ ప్రకారం, 'వికాస కృత్యాలు'?

(A)   సాంఘిక అంచనాలు
(B)   వైద్య ప్రమాణాలు
(C)   అభ్యసన ఆసక్తులు 
(D)   విద్యాపరమైన మైలురాళ్ళు


ఈ క్రింది వానిలో అభ్యసమునకు సంబంధించి సరైనది?

(A)   ప్రక్రియ మరియు కంఠస్థములకు ప్రాధాన్యతనిచ్చుట. 
(B)   ఫలితము మరియు ఉద్యోగకల్పనకు ప్రాధాన్యతనిచ్చుట.
(C)   పరీక్షల్లో విజయానికై ప్రాధాన్యతనిచ్చుట.
(D)   ప్రక్రియ మరియు ఫలితములు ప్రాధాన్యతనిచ్చుట.



RTE - 2009 చట్టం ప్రకారం ఈ వయస్సు గల పిల్లలకు ఉచిత నిర్బంధ విద్య పొందే హక్కు కలదు?

(A)   3 - 12 సంవత్సరాలు 
(B)   4 - 13 సంవత్సరాలు
(C)   5 - 14 సంవత్సరాలు  
(D)   6 - 14 సంవత్సరాలు